ఆ దిశలో పడక గది లేకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.. కానీ ఇంటికి నైరుతి లోపం ఉంది. అందుకు వాస్తు ప్రకారం ఇలా చేస్తే చాలు.. మంచి ఫలితాలు కలుగుతాయి. నైరుతిలో పడకగదిని నిర్మించుకోవాలి. ఒకవేళ ఆ దిశ లేకపోతే నైరుతి పడమర అంటే.. పడమర దిశకు సమానంగా ఇంటిని సరిచేసుకుంటే మంచిది. అప్పుడే నైరుతిలో పడకగది వస్తుంది. నైరుతితో పడక గది నిర్మించకపోతే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశాలున్నాయి.
అందువలన మీ గృహాన్ని సరిచేసి హాలులో నైరుతి దిశగా పడక గదిని అమర్చుకోవాలి. అలాగే దక్షిణం, పడమర దిశను మూయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ దిశలు మూసివేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని.. వాటిని భరించడం చాలా కష్టమేనని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం కట్టుకుంటే మంచిది.