శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (11:57 IST)

ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..?

ఆలయాలకు వెళ్లాలంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు పూజ పూర్తయిన తరువాత తీర్థాన్ని ఇస్తారు. అదీ ఒక్కటి కాదు రెండు కాదు మూడుసార్లు ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం..
 
మెుదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండవ సారి తీసుకునేది ధర్మసాధనకు, మూడోసారి తీసుకునేది పరమపదం కోసమని పండితులు చెబుతున్నారు. అలానే కొన్ని ఆలయాల్లో ఆ తీర్థాన్ని రాగి పాత్రలో ఇస్తుంటారు. రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో.. అదేవిధంగా పూజలకు అంతే మంచి చేస్తుందని విశ్వాసం. 
 
చాలామంది తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి ఆ తీర్థాన్ని తలకు అంటుకుంటారు. అలా చేస్తే పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. కానీ, అది నిజం కాదు.. అసలు తీర్థాన్ని తలకు అంటకూడదు. ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారంటే.. దానిని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి గల దోషాలు, పాపాలు తొలగిపోవాలని ఇస్తారు.

కానీ, తీసుకునే వారు మాత్రం వాటిని తొలగించుకోకుండా.. తలకు అంటుకుంటుంటారు. ఇలా చేస్తే మీ దోషాలు, పాపాలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు చెప్తున్నారు. కనుక తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి మీ వస్త్రాలతో శుభ్రం చేసుకోండి.