1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Rice Flour Lamp Significance

శనివారం పిండి దీపం వేస్తే.. ఏంటి ఫలితం..? video

Rice flour
Rice Flour Lamp
శనివారం పిండి దీపం వేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటిముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి. 
 
స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి,పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. 
Rice Flour Lamp
 
పూజ చేసేటప్పుడు ''ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు‌