శుక్రవారం తులసీ పూజ.. గోవు పూజ చేస్తే..? (Video)

tulasi kota
tulasi kota
సెల్వి| Last Updated: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:14 IST)
ఇంట్లో తులసిమొక్క ఉంటే శుక్రవారం ఉదయం, సాయంకాలం దాని దగ్గర దీపం వెలిగించాలి. గృహానికి ఇది శుభకరం. ఇంటి ముఖ్య ద్వారం బయట వైపు శ్వేతార్క గణపతిని ఉంచితే శత్రు, రోగ, చోర భయాల నుండి రక్షణ లభిస్తుంది. ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవికి, అమ్మవార్లు అంటే దుర్గ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది.

అదేవిధంగా తులసీపూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులున్నారు.
Gomatha
Gomatha

అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ-ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ - ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి.

ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవులోని పృష్టభాగం లక్ష్మీస్థానంగా భావిస్తారు. పూజిస్తారు. పండుగలు, గృహప్రవేశాలు, అపర కర్మలలో కూడా గోవుకు ప్రధాన స్థానం ఇస్తారు.

పూర్వకాలంలో ప్రజల జీవనవిధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. దీనిలో గోవు పాత్ర చాలా కీలకం. ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది. గోవు నుంచి వచ్చే ప్రతీ ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి.
Gomatha
Gomatha

అంతేకాదు గోవు నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ ప్రతీ ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. గోమూత్రంతో క్యాన్సర్‌ మొదటి దశలోనే అరికట్టవచ్చునని పరిశోధనలలో తేలింది. అలాగే గోపేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో, హోమాలలో వాడుతారు. అంతేకాదు నిత్యం మనం ఇంట్లో ఆవుపిడకలపై కొంచెం ఆవు నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు, దోమల నుంచి రక్షించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

దీనిపై మరింత చదవండి :