మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (20:34 IST)

శుక్రవారం పూట రాళ్ల ఉప్పును ఇతరులకు ఇవ్వకండి.. నలుపు రంగు..? (video)

శుక్రవారం మాసిపోయిన బట్టలు అస్సలు తాకకూడదని.. ఇంటిల్లపాదిని శుభ్రంగా వుంచుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శుక్రవారం రోజున మాసిన బట్టలు, ముతక బట్టలు ధరించడం వలన అరిష్టమని, ఆ బట్టలు తాకడం కూడా చేయకూడని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఉన్న నగలను తాకట్టుపెట్టడం, ఎవరికైనా ఇవ్వడం చేయకూడదు. 
 
ఈ రోజున లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారికి పూజలు చేసే వారి ఇంట్లో ఉంటుందని అందుకని నగలు తాకట్టుపోవడం వద్దని అంటున్నారు. కావాలంటే శుక్రవారం నగలను కొనుగోలు చేయవచ్చు. శుక్రవారం నాడు మగవాళ్ళు గడ్డం గీయటం, జుట్టు కత్తిరించుకోకూడదు, కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదని అంటారు. అలాగే మహిళలు కూడా తమ జుట్టు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. 
Saree
 
వివాహితులు నుదుటన బొట్టు లేకుండా వుండకూడదు. ఇంట్లో రాళ్ల ఉప్పు కొనిపెట్టడం చేయొచ్చు. ఇలా చేస్తే.. ఐశ్వర్యాలు చేకూరుతాయి. కానీ అప్పు మాత్రం శుక్రవారం చేయకూడదు. రాళ్ల ఉప్పును అప్పు తీసి కొనడం చేయకూడదు. శుక్రవారం పూట రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. కానీ శుక్రవారం పూట నీటిని పొరుగింటికి ఇవ్వడం, రాళ్ల ఉప్పును ఇవ్వడం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
అలాగే శుక్రవారం పూట మహిళలు నలుపు దుస్తులు, నలుపు బొట్టు, నలుపు గాజులు ధరించకూడదు. ఉప్పును డబ్బు పెట్టి కొనుక్కోవడం శుక్రవారం తీసుకోవచ్చు కానీ.. దానంగా మాత్రం రాళ్ల ఉప్పును తీసుకోకూడదు. శుక్రవారం రావిచెట్టును తాకడం కూడదు. రావి ఆకులను త్రుంచకూడదు. శుక్రవారం పూట మహిళలు ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేయడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయి. 
 
అలాగే శుక్రవారం తులసీ పూజను మరిచిపోకూడదు. తులసీ కోట వద్ద దీపం వెలిగించి.. తులసీ కోటకు నీరు పోసి పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.