మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (19:22 IST)

పరగడుపున బయటికి వెళ్తున్నారా? ఒక స్పూన్ పెరుగును..? (Video)

లక్ష్మీ కటాక్షం లభించాలంటే.. ప్రతీ శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇళ్ళు శుభ్రం చేసుకున్నాక పూజను ముగించి అల్పాహారం తీసుకోవాలి. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు, ముఖం కడుక్కుని అయినా ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. 
 
పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఏదో ఒకటి దానం చేయండి. దీన్ని తప్పకుండా ప్రతి గురువారం అనుసరించండి. 
 
ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. భోజనానికి ముందు మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. వీలుకాదు అనుకుంటే అన్నం వండగానే ఒకముద్ద తీసి పెట్టుకుని ఆవుకు పెట్టండి. చెడిపోయిన అంటే పాసిపోయిన అన్నం మాత్రం ఆవులకు పెట్టకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.