అరటి నారలతో దీపం వెలిగిస్తే.. శివునికి, నృసింహ స్వామికి...? (Video)
అరటి నారలతో దీపాన్ని వెలిగిస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు. దీప ప్రజ్వలనకు విశిష్ఠమైన సమయం బ్రహ్మ ముహూర్త కాలం. ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు (సూర్యోదయానికి ముందు).. సూర్యోదయానికి తర్వాత అంటే ఆరు నుంచి ఏడు గంటల వరకు.. అరటి నారతో దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఉదయం పూట అరటి నారలతో దీపాన్ని వెలిగిస్తే.. సకల కార్యాలు దిగ్విజయమవుతాయి. ఇంకా పుణ్యఫలం చేకూరుతుంది. పూర్వ జన్మల పాపం తొలగిపోతుంది. అలాగే సాయంత్రం పూట 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రదోష సమయంలో శివునికి, నరసింహ స్వామికి అరటి నారలతో దీపం వెలిగిస్తే.. విద్యాభివృద్ధి, వివాహ దోషాలు తొలగిపోతాయి.
ఇంకా శ్రీ మహాలక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. అరటి నారతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే పితృదోషాలుండవు. ఇంకా దైవ సంబంధిత దోషాలు కూడా తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు వుండవు. ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యలుండవు. ఇంట్లో ప్రశాంతత, సిరిసంపదలు, సంతాన ప్రాప్తి చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.