ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (18:44 IST)

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే.. నేతితో దీపం వెలిగిస్తే?

Varalaxmi Vrat
శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేపట్టడం ద్వారా కలిగే శుభఫలితాలేంటో తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళలు.. వంశాభివృద్ధితో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీ స్తుతి, శ్రీలక్ష్మీ చరిత వంటి వాటితో నిష్ఠతో పూజించాలి. 
 
అష్టైశ్వర్యాలను పొందాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అష్టలక్ష్మీ దేవతల్లో ఒకరైన వరలక్ష్మీ దేవివి పూజించడం ద్వారా సమస్త సంపదలు చేకూరుతాయి. అలాగే మాంగల్యబలం కోసం, దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కోసం ఈ పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 
 
ఈ వ్రతం ఆచరించడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. జాతకంలో శుక్రదోషాలుంటే తొలగిపోతాయి. కళత్ర దోషాలుండవు. మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలుండవు. అన్యోన్యత పెంపొందుతుంది. 
 
ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విడిపోయిన దంపతులు ఒక్కటవుతారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు.. ఆ రోజున ఆలయాల్లో దేవేరికి నేతిలో దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
అలాగే వరలక్ష్మీ వ్రతమాచరించే వారు.. ఆ రోజున ఆలయాల్లో పేదలకు పెరుగన్నం, చక్కర పొంగలి దానం చేయడం మంచిది. ధనం దానంగా ఇవ్వడం చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.