సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (10:08 IST)

భారత్‌లో కరోనా.. 17లక్షల మార్కుకు చేరువలో కేసులు.. 764 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 16 లక్షల 95 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 57,117 కేసులు నమోదు కాగా, 764 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 36,569 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 16,95,988 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,65,103 ఉండగా, 10,94,374 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 36,511 మంది కరోనా వ్యాధితో మరణించారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.3శాతంగా ఉంది. కాగా, శుక్రవారం వరకు మొత్తం 1,93,58,659 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.