సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (21:18 IST)

ఒకవేళ నాకు కారోనా వస్తే తప్పకుండా ప్లాస్మా డొనేట్ చేస్తా: హీరో విజయ్ దేవరకొండ

కరోనాను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్‌ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు.
 
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. "ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది. 

ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్లను కాపాడవచ్చు. ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు. 200 మంది పేషెంట్‌లను కాపాడాము. ప్లాస్మా దానం చేసిన వారు కరోనాయోధులు. వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలి"అన్నారు.
 
చీఫ్ గెస్ట్‌గా హాజరైన హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కరోనా వచ్చింది. వారికి ప్లాస్మా అవసరం వచ్చింది. కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు. అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది. ఇంతకుముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్ఫ్యూజ్ ఉండేది. కానీ ఇప్పుడు donateplasma.scsc.in అనే వెబ్ సైట్లో లాగిన్ అయితే చాలు.
ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు.
 
రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా. వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా" అన్నారు.