శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 జులై 2020 (20:58 IST)

కరోనాను పారదోలేందుకు గరుడపురాణం కార్యక్రమాలు చేస్తాం: వైవి సుబ్బారెడ్డి

కరోనా సమయంలో ప్రారంభించిన సుందరకాండ, వేదపారాయణం, విరాట పర్వం కార్యక్రమాలకు భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తోంది అని, త్వరలోనే భగవద్గీత, గరుడ పురాణం కార్యక్రమాలును ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు.
 
త్వరలో యస్వీబిసి చానల్‌ని హిందీలో కూడా ప్రసారం చేస్తామని, యస్వీబిసి చానల్ యాడ్‌ఫ్రీ చానల్‌గా నడిపిస్తాం  అన్నారు. చానల్ నిర్వహణకి భక్తులు నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
 
లాభనష్టాలను బేరీజు వేసుకోవడానికి టిటిడి వ్యాపార సంస్థ కాదనీ, సేవా సంస్థనీ, దేవుడే దారి చూపిస్తాడని అన్నారు.కరోనా నుంచి భక్తులు అందరు ఉపశమనం పోందేలా కార్యక్రమాలు నిర్వహించడమే ప్రస్తూతానికి తమ ముందు వున్న లక్ష్యం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.