బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 జులై 2020 (15:11 IST)

కరోనావైరస్‌తో పురుషోత్తం స్వామీజి కన్నుమూత, ఆందోళనలో ఆయన నోటి ప్రసాదం తీసుకున్నవారు

గుజరాత్ లోని అహమ్మదాబాదులో స్వామి పురుషోత్తం స్వామిజీ కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 170 నారాయణ ఆశ్రమాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నారు. ఆయన శనివారం కరోనావైరస్‌తో మరణించారు. చివరకు ప్లాస్మా చికిత్స నిర్వహించినప్పటికి ఫలితం లభించలేదు.
 
అయితే ఇప్పుడు అయన భక్తులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. స్వామి వారి ప్రసాదాన్ని నోటితో అందిస్తారు. దీంతో ఆయన నోటితో ఈమధ్య కాలంలో ప్రసాదాన్ని అందుకున్న వారు 250 మందికి పైగా వున్నారంట. వారందరికి ఇప్పుడు తీవ్ర ఆందోళనతో వున్నారు.
 
మొత్తం మీదా స్వామి వారికి చాలమంది ప్రముఖలు కూడా భక్తులుగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనను దర్శించుకున్నవారిలో మాజీ ప్రధానులు, ప్రముఖ రాజకీయ నేతలు వున్నారని సమాచారం. ఇప్పుడు స్వామి వారి మరణంతో ఆయన భక్తుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి కరోనా భయంతో.