1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Shani Pradosh Vrat 2024

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Lord Shiva
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు.
 
ఈ సమయంలో గంగాజలంతో, ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. 
 
శని ప్రదోషం సమయంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. ఇంకా ప్రదోష సమయంలో జరిగే అభిషేకాలను కళ్లారా చూడటం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
డిసెంబర్ 28వ తేదీ శనివారం సూర్యాస్తమయం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి. ఈ రోజున శివునికి పాలు, పెరుగు అభిషేకానికి సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...