1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Vaikuntha Ekadashi Vrat 2025

ముక్కోటి ఏకాదశి: 2025లో రెండు సార్లు వస్తోంది..

Ekadasi
సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండగ వస్తుంది. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహా విష్ణువుని దర్శిస్తే చేసిన పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంత విశిష్టమైన ముక్కోటి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. కాని 2025లో రెండు సార్లు రానుంది.  
 
సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహా విష్ణువు మూడు కోట్ల దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం.
 
ముక్కోటి రోజు భక్తులంతా తప్పకుండా ఉపవాసం ఉంటారు. శక్తి కొలదీ భజనలు, భక్తి పాటలు, విష్ణు సహస్ర నామ పారాయణలు ఇలా అనేక స్తోత్రాలు పఠిస్తారు. ఇంత ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఒకసారే వస్తుంది కాని 2025లో మాత్రం రెండు సార్లు రానుంది. 
 
దీనికి కారణం 2024 లీపు సంవత్సరం కావడం, తిథుల్లో తగులు, మిగులు రావడం వల్ల ఏటా డిసెంబర్‌లో రావాల్సిన ముక్కోటి 2025లో మాత్రం జనవరి 10వ తేదీన వస్తోంది. ఇదే ఏడాది చివర్లో డిసెంబర్ 30వ తేదీన మరో ముక్కోటి ఏకాదశి రానుంది. ఇలా ఒకే సంవత్సరంలో రెండు సార్లు వైకుంఠ ఏకాదశిలు రానున్నాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
11-01-2025 శనివారం దినఫలితాలు : మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...