సంబంధిత వార్తలు
- తమిళ హీరో ఆర్యపై చీటింగ్ కేసు : రాష్ట్రపతికి జర్మన్ మహిళ ఫిర్యాదు
- సాయేషా సైగల్‌కు పాప.. ఇంతలో ఆర్యపై జర్మనీ మహిళ కేసు.. పెళ్లి చేసుకుంటానని..?
- పది లక్షల భోజనాలను అందించేందుకు సంగీతా మొబైల్స్‌తో చేతులు కలిపిన ఫీడింగ్ ఇండియా బై జొమాటో
- ఆకుల్లో అన్నం తింటే ఏంటి ఫలితం?
- జోకర్ లింక్ క్లిక్ చేశారో... మీ ఖాతా ఖాళీనే...
ఎటువైపు కూర్చుని భోజనం చేస్తున్నారు?
తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే దీర్ఘాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది.
ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. అన్నము తింటున్నప్పుడు అన్నమును, ఆ అన్నము పెట్టువారిని తిట్టుటం, దుర్భాషలాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నెలోనూ లేదంటే ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు.
ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో పళ్ళెము పెట్టుకుని అన్నం తినకూడదు. ఇది దరిద్రము. అలాంటివారికి నరకము ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. భోజనానంతరము ఎంగిలి ఆకులు లేదా కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.
