ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (10:13 IST)

జోకర్ లింక్ క్లిక్ చేశారో... మీ ఖాతా ఖాళీనే...

లాక్డౌన్ సమయంలో ఆన్‌లైన్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మోసాల్లో చిక్కుకుని అనేక మంది డబ్బును విపరీతంగా కోల్పోతున్నారు. 
 
ఇదే అంశంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, లాక్డౌన్‌ కాలంలో యువత ఎక్కువగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారని, చాలా మంది సైబర్‌ క్రిమినల్స్‌ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారన్నారు. 
 
అందువల్ల కొత్త వెబ్‌సైట్ల జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ముంబైలో జోకర్‌ పేరిట వెలుగు చూసిన మోసాలను ఆయన గురువారం ప్రస్తావించారు. ప్రస్తుతం ముంబైలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, నగరంలో కూడా ఇలాంటి మోసాలు వెలుగుచూసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. 
 
చిన్నారులు కూడా కంప్యూటర్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో మాలిషియస్‌, మాల్‌వేర్‌, టూజ్రాన్‌ లాంటి వైర్‌సలను ప్రవేశపెట్టి సైబర్‌ నేరస్థులు సిస్టం డేటాను సేకరించి దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు. ముంబైలో జోకర్‌ పేరుతో వచ్చిన వైరస్‌ ఎంతోమంది ఖాతాలను ఖాళీ చేసిందన్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గూగుల్‌ బ్లాక్‌ చేస్తే, మరో పేరిట సాఫ్ట్‌వేర్‌ రూపొందించి సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలోనూ బ్లూవేల్‌, ఇతర పేర్లతోనూ మోసాలు జరిగాయని గుర్తు చేశారు.