1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (11:44 IST)

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం... ఈటల బృందానికి తప్పిన ప్రమాదం

స్పైస్ జెట్ సంస్థకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా, అపుడు ఈ సమస్య తలెత్తింది. ఆ తర్వాత లోపాన్ని సరిచేసిన తర్వాత విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది.
 
తెరాసకు రాజీనామా చేసిన ఈటల.. ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈయనతో పాటు... ఆయన వెంట వెళ్లిన వారంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్ విమానంలో బయలుదేరారు. అయితే ఈ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్‌ సమయంలో విమానం రన్‌ వేపై ఉండగా సాంకేతిక సమస్యను పైలెట్‌ గుర్తించారు. గాల్లోకి లేచే టైంలో అప్రమత్తమై ఫైలెట్‌ విమానాన్ని ఆపేశారు. ఆ తర్వాత సమస్యను సరిచేశారు. 
 
కాసేపటి క్రితమే ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఈటెల రాజేంద్రర్‌ బృందం బయలుదేరింది. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రఘనందన్‌, మాజీ ఎంపి వివేక్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుల ఉమాతోపాటు మొత్తం 184 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం హైదరాబాద్‌కు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. 
 
కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈట‌ల చేరుకోగానే ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు మ‌ద్ద‌తుదారులు  ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయ‌న‌తో పాటు  ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. వారితో పాటు ప‌లువురు నేత‌లు కూడా ఉన్నారు.