1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
  4. Health and Fitness Tips for Women

మహిళలూ శరీరాకృతిని ఫిట్‌గా ఉంచుకోవాలా? ఐతే మానసిక ఆరోగ్యం ముఖ్యమండోయ్!

మహిళలూ మీ శరీరాకృతిని జీవితాంతం పక్కాగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే జాగింగ్, వాకింగ్, జిమ్‌కు వెళ్ళడం.. డైట్ పాటించడం వంటివి చేయడంతో శరీరాకృతి పొందవచ్చునని అనుకోవడం ఒకవైపుంటే.. శరీరాకృతి పక్కాగా ఉండ

Health and Fitness Tips for Women
మహిళలూ మీ శరీరాకృతిని జీవితాంతం పక్కాగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే జాగింగ్, వాకింగ్, జిమ్‌కు వెళ్ళడం.. డైట్ పాటించడం వంటివి చేయడంతో శరీరాకృతి పొందవచ్చునని అనుకోవడం ఒకవైపుంటే.. శరీరాకృతి పక్కాగా ఉండాలంటే.. మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఫిట్‌‍నెస్ కూడా లభిస్తుంది.
 
ఇంకా ఈ టిప్స్ పాటిస్తే శరీరాకృతిని ప్రసవం తర్వాత కూడా పక్కాగా ఉంచుకోవచ్చు. అవేంటంటే..? 
* పాల ఉత్పత్తులు, చాక్లెట్లు, వెన్న వంటి పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని గుర్తించండి. 
* సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండండి. 
* ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 లీటర్ల నీరు అవసరం.
* మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే వ్యాయామం చేయండి. 
* ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాకృతిని కాపాడుకోవచ్చు.
* రోజుకి 30 నిమిషాలు ప్రత్యేకమైన, ఎంతో శక్తివంతమైన గుండెకు సంబంధించిన వ్యాయామం చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి, శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
About Writer
chitra
తర్వాతి కథనం
ఫంక్షన్‌కి వెళ్ళాలా.. టైమ్ లేదా.. అయితే టమోటా గుజ్జు, మిల్క్ ప్యాక్ ట్రై చేయండి!