1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. significance of Magha purnima 2022

మాఘ పూర్ణిమ: మాధవః ప్రీయతామ్ అని చెప్పి...

significance
సితాసితే తు యస్స్నానం మాఘమాసే యుధిష్ఠిర
సతేషాం పురావృత్తిః కల్పకోటి శతైరపి

 
మాఘశుక్ల, కృష్ణ పక్షాలలో చేసే స్నానం మహోన్నత ఫలప్రదమని శాస్త్రవచనం. అందుచేత శుక్ల, కృష్ణ పక్షాలలోనే గాకుండా మాఘపూర్ణిమ నాడు స్నానానంతరం తిలలు, ఉసిరికలు, దానం చేయవచ్చు. నియమంగా శివపూజ, విష్ణుపూజ, అభీష్ట దేవతాపూజ చేయాలి. ''మాధవః ప్రీయతామ్‌" అని చెప్పి వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు మొదలైనవి దానమీయవచ్చు. అన్నదానం కూడా చేయవచ్చునని పండితులు అంటున్నారు.

 
తిలతైలేన దీపాశ్చ దేయాః శివగృహే శుభాః
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది. ఈ మాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున శివాలయంలో దీపం పెట్టడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

 
మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శీతల జలంతోనే స్నానం చేయాలి. నదీస్నానాదులు ఉత్తమం. 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మాఘపౌర్ణమి సాయంత్రం లలితా సహస్రనామాన్ని మరవద్దు