శాప ఫలితం... శిలలుగా మారిన ఊరి జనం
|
స్థానికుల అభిప్రాయం ప్రకారం...మాల్వా క్షత్రియుడైన గంధర్వసేనుడిని గంధర్వభిల్‌గా కూడా పిలుస్తున్నారు. ఆయన శాపంతో గ్రామమంతా రాయిలా మారిపోయింది. దీనికి సంబంధించి చాలా కథనాలు వెలుగు చూస్తున్నప్పటికీ, స్థానికుల కథనమంతా దాదాపు ఒకే రకంగా ఉంటోంది. గంధర్వ సేనుడు నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారిని పెళ్లాడగా, శాత్రాని ద్వారా శంఖ్, రాజా విక్రమాదిత్య, భర్తృహరిలను సంతానంగా పొందాడు.
| |
| |
స్థానికుడైన కమల్ సోని మాట్లాడుతూ ఇది పురాతన పట్టణమైనందున ఈ స్థలం ఎపుడు పాతుకుపోయిందో, అక్కడి పాత రాతి విగ్రహం అక్కడ ఎపుడు వెలిసిందే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదన్నారు. విక్రంసింగ్ కుష్వా వివరిస్తూ తన అభీష్టానికి వ్యతిరేకంగా రాజు కుమార్తె గంధర్వసేనుడిని వివాహమాడింది. ఉదయం వేళలో గాడిదగా కన్పించే గంధర్వ సేనుడు రాత్రి వేళలో ఆ చర్మం వీడి అందమైన యువరాజుగా కన్పించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు గంధర్వసేనుడు వదిలిన చర్మాన్ని తగులబెట్టాలని తన సేవకులను ఆదేశించాడు.
అయితే గంధర్వసేనుడు గాడిద శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించే సమయంలో అతని శరీరాన్ని సజీవంగా తగులబెట్టారు. దీంతో గంధర్వసేనుడు ఆ పట్టణంలో నివశించేవారెవరైనా రాయిగా మారాల్సిందేనని శపించాడు. దీనిపై గ్రామ పెద్ద విక్రమ్ సింగ్ చౌహాన్ వద్ద మాట్లాడాం. ఆయన కూడా శాపగ్రస్త పట్టణం భూమిలో పాతుకుపోయిన విషయం నిజమేనన్నారు. గ్రామంలోని భూగర్భంలో వేలాది రాతి శిలలు ఉన్నాయి.
|
బుద్ధుడు, మహావీరుడు, విష్ణు విగ్రహాలతో పాటు గ్రామస్తులు ప్రతిరోజూ గ్రామీణ వృత్తులను ప్రతిబింబించే అనేక రాతి శిలలు కూడా ఉన్నాయి. సుమారు 300 రాతి విగ్రహాలు మ్యూజియంలో ఉంచారు. వెయ్యి శిలల వరకు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అసలు ఓ శాపం ద్వారా పట్టణమంతా రాయిగా మారగలదని మీరు విశ్వసిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు మాకు పంపండి.
