శృతి మించిన విశ్వాసం
|
విశ్వాసానికి లోనైన మనిషి దాని ప్రభావంతో ఏదైనా చేస్తాడు... ఏది నిజం శీర్షికలో భాగంగా, నవరాత్రి దినాలలో శక్తిని పూజించే సమయంలో విశ్వాసం చూపే ప్రభావాన్ని మీకు పరిచయం చేస్తున్నాము... భక్తి భావనకు లోనైన భక్తులు తమ శరీరాన్ని గాయపరుచుకోవడం ద్వారా దేవతకు పూజ చేస్తారు. మరికొన్నిసార్లు అసాధారణమైన పనులకు పూనుకుంటారు.
సాధారణ దినాలలో 'శక్తి'మాతను కొలిచే భక్తుల భావోద్వేగాలు తగు మోతాదులో ఉంటాయి. అదే నవరాత్రి దినాలలో అయితే భక్తుల భావోద్వేగాలు హద్దులు దాటుతుంటాయి. మనస్సు, తనువు వారి అదుపులో ఉండవు.
మొదటగా ఇండోర్‌లోని దుర్గామాత దేవలయానికి మేము చేరుకున్నాము. ఇక్కడి దేవాలయ పూజారి ఒంట్లోకి దుర్గామాత వస్తుందని చెప్పుకుంటారు.
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దుర్గామాత అవతారంగా భావించిన భక్తులు అతనికి పూజలు చేస్తున్నారు. అలా పూజలు చేస్తున్న వారిలో కొందరు వ్యాపారస్థులు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని కులాలకు చెందిన భక్తులు మనకు అక్కడ కనిపిస్తుంటారు.
|
తరువాత మేము ఇండోర్-ధార్ రోడ్డులోని గ్రామానికి చేరుకున్నాము. ఆ గ్రామంలోని కొలను దగ్గర జరుగుతున్న 'శక్తి' పూజ భయానకంగా ఉంది. కొందరు మహిళలు కత్తితో తమ నాలుకలను కత్తిరించుకుంటున్నారు... ప్రజలు పలు రకాలుగా తమని తాము గాయపరుచుకుంటున్నారు.
ఇటువంటి సంఘటనలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో జరుగుతుంటాయి... కొందరు ప్రజలు తమను దుర్గామాత అవతారంగా భావించుకుంటారు. మరి కొందరు ప్రజలు తమను కాళీమాత అవతారంగా చెప్పుకుంటారు. ఈ రకమైన భక్తిభావన ఇప్పుడు విపత్కర రూపాన్ని సంతరించుకుంది. భక్తిలో మునిగి తేలే ఈ
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడిక అత్రిమాత దేవాలయానికి వెళదాం పదండి. ఈ దేవాలయం నీమచ్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడి కాళీమాతకు నాలుకను సమర్పించుకుంటే, తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వేల సంఖ్యలో భక్తులు తమ నాలుకను దేవతామూర్తికి సమర్పించుకున్నారని పూజారి నమ్మబలికాడు.
|
మా కళ్లముందే అతడు తన నాలుకను అత్రిమాతకు సమర్పించుకున్నాడు. మనోహర్ వలె అనేక మంది భక్తులు తమ నాలుకను మాతకు సమర్పించుకుంటున్నారు. నాలుకను సమర్పించుకున్న అనంతరం కొంతకాలం ఈ దేవాలయంలో ఉండాలని భక్తుల విశ్వాసం. దేవాలయంలో 8 నుంచి 10 రోజులు ఉన్న తర్వాత, నాలుకను సమర్పించిన వారు తమ గాత్రాన్ని తిరిగి పొందుతారు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేవాలయంలో 10 రోజులు గడిపిన అనంతరం తనకు మాట వచ్చిందని ప్రభాత్ దేవ్ అనే భక్తుడు మాతో అన్నాడు.
అత్రిమాతకు నాలుకను సమర్పించుకోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మతి పోయినంత పనైంది. హఠాత్తుగా అనేక సందేహాలు మా మెదడులో
|
ఇటువంటి పనులు వారి కోరికలను తీరుస్తాయా? ఉన్మాదులను పోలినట్లు ఊగిపోతున్న ప్రజలలోకి మానవాతీత శక్తులు ప్రవేశిస్తాయా? ఈ ప్రశ్నలుకు ఎంత వెతికినా మా దగ్గర సమాధానం దొరకలేదు...మీరేమని అనుకుంటున్నారో దయ చేసి మాకు రాసి పంపండి...
