1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. brungi vahanaseva in srisailam

శ్రీశైలంలో బృంగి వాహ‌న‌సేవ‌..!!

brungi vahanaseva in srisailam
శ్రీశైలం మ‌హాక్షేత్రంలో జ‌రుగుతున్న ఉగాది మ‌హోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం బృంగివాహ‌నం పై మ‌ల్లిఖార్జున స్మామి, అమ్మ‌వార్లు ద‌ర్శ‌న‌మిచ్చారు.ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు ఉభ‌య దేవాల‌యాల‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.సాయంత్రం అక్క‌మ్మ దేవి అలంకార మండ‌పంలో శ్రీస్వామి అమ్మ‌వార్ల ఉత్స‌వ మూర్తుల‌ను బృంగివాహ‌నంపై అధిష్టింప‌చేసి,వివిధ ర‌క‌ములైన పుష్ప‌ముల‌తో అలంక‌రింప‌చేసి, ప్ర‌త్యేక‌ పూజ‌లు నిర్వ‌హించి ఆల‌యం ప్రాంగ‌ణం ద్వారా బృంగివాహ‌నమును ర‌ధ‌శాల వ‌ద్ద‌కు తీసుకుని వ‌చ్చి ప్ర‌త్యేక విద్యుత్ దీపాల‌తో గ్రామోత్స‌వం నిర్వ‌హించారు.
 
ఈ ఉత్స‌వం ముందు వివిధ క‌ళాకారుల నృత్యాలు,లంబాడీల నాట్యాలు,చిన్న‌పిల్ల‌ల కోలాటాలు,శివ‌పార్వ‌తుల నృత్యాలు, డ‌ప్పు వాయిద్యాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ గ్రామోత్స‌వం క్షేత్ర‌పుర వీధుల‌లోని అంకాల‌మ్మ గుడి, నందీశ్వ‌రుని గుడి, బ‌య‌లు వీర‌భ‌ద్ర‌స్వామి గుడి వ‌ర‌కు వెళ్ళి  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, తిరిగి ఆల‌యానికి తీసుకువ‌చ్చారు.
About Writer
JSK