1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Kalaignar Tv Ramanujar Serial in telugu

ఇకపై తెలుగులోనూ రామానుజాచార్య సీరియల్! ఎస్వీబీసీలో...!?

Kalaignar Tv
తమిళనాడు మాజీ సీఎం, ప్రముఖ రచయిత కరుణానిధి మాటలు రాసిన రామానుజాచార్య సీరియల్ ఇకపై తెలుగులోనూ ప్రసారం కానుంది.

హేతువాది, నాస్తికుడు అయిన కరుణానిధి.. భక్తిరసం ఉప్పొంగేలా మాటలు రాసిన ఈ సీరియల్ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ధారావాహికకు అత్యద్భుత సంభాషణలు అందించారు. తద్వారా ఈ సీరియల్‌ను త్వరలో మనం కూడా చూసే అవకాశాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ కల్పిస్తోంది. 
 
ఇందుకోసం ఇప్పటికే కలైంజర్ టీవీ ప్రతినిధులతో మంతనాలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ సీరియల్ రైట్స్ పొందేందుకు వెంకటేశ్వర భక్తి ఛానెల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కరుణానిధి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.