1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Pournami Garuda Seva on Feb 12

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ

Garuda Seva
ఫిబ్రవరి 12న తిరుమలలో నెలవారీ పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా, శ్రీ మలయప్ప స్వామి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
 
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 
ఇక, ఆదివారం శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?