50 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం 50 నిమిషాల్లో భక్తులకు లభిస్తోంది. పాఠశాలల్లో పరీక్షలు నడుస్తున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. తిరుమల మాడా వీధులతో పాటు తిరుమల గిరులు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే వీఐపీల తాకిడి మాత్రం కనిపిస్తోంది.
గురువారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం ఒక కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. అలాగే కాలినడక భక్తులు కూడా ఒకే ఒక కంపార్టుమెంటులో వేచి ఉన్నారు. సర్వ దర్శనంతో పాటు కాలినడక భక్తులకు 50 నిమిషాల్లోపై దర్శనం పూర్తవుతోంది. బుధవారం శ్రీవారిని 57,657 మంది భక్తులు దర్శించుకోగా హుండీ దాయం రూ.2.12 కోట్లుగా వచ్చింది.
