1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala Tirupati VIP Break Darshan Ticket hikes

లడ్డూ ధరపై వెనక్కి తగ్గిన సబ్ కమిటీ.. వీఐపీ టిక్కెట్ ధరలు పెరగనున్నాయా?

Tirumala Tirupati
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవతో పాటు, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మ, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావై సేవా టికెట్ల ధరలను పెంచడానికి సబ్ కమిటీలోని మెజార్టీ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తద్వారా శ్రీవారి వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవా టిక్కెట్లు ధరలు భారీగా పెరగనున్నాయి. 
 
తిరుపతిలో కల్యాణ మండపం నిర్మించాలని.. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ్ మండపాల అద్దెను పెంచడంతో పాటు ఆధునీకరించాలని కూడా సబ్ కమిటీలో తీర్మానించినట్లు సమాచారం. ఇంకా రూ.50కి గదుల అద్దె ధరను, రూ.100కి పెంచాలని సబ్ కమిటీ నిర్ణయించింది. కానీ లడ్డూ ధరను కూడా పెంచాలనే నిర్ణయానికి.. భక్తులు వ్యతిరేకతలు వస్తాయనే ఉద్దేశంతో ధరపెంపుపై సబ్ కమిటీ వెనక్కి తగ్గింది.
About Writer
Selvi