1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala: TTD release August quota online today

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసిన తితిదే

Tirumala
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం రిలీజ్ చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన కోటా దర్శన టికెట్లు విడుదల చేసింది. 
 
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 17 నుంచి నాలుగు రోజల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 
 
ఈ రోజులకు సంబంధించి ప్రత్యేక టికెట్లను విడుదల చేశారు. టికెట్లను విడుదల చేసిన కొంత సమయానికే చాలా వరకు అమ్ముడుపోయాయి. అధికసంఖ్యలో భక్తులు టికెట్లు బుక్​ చేసుకునేందుకు ఆసక్తి కనబర్చడంతో వెబ్‌సైట్‌ స్తంభించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
05-08-2021 గురువారం దినఫలాలు - అమ్మవారిని పున్నాగపూలతో...