శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (14:56 IST)

ఉధృతంగా కృష్ణానది - సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు రిలీజ్

ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ వరదనీరు వస్తోంది. ఈ వరద నీటితో కృష్ణానది ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు, ఆదివారం మధ్యాహ్నం నుంచి నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశo ఉంది. 
 
ప్రస్తుతం కృష్ణ  బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 33,002 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 24,750 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. 
 
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అంతేకాకుండా మత్య్సకారుల పడవలు, ఇళ్లల్లో పెంచుకునే పాడిపశువులు, మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు.