మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 31 జులై 2021 (13:37 IST)

ఆగష్టు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు, ఏమిటో తెలుసా?

నిత్య కైంకర్యాలతో తిరుమల ఆలయం ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది. స్వామివారికి ఎన్నో విశేష కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తూ వస్తుంటుంది. ముఖ్యంగా సేవలు తిరుమలలో లెక్కకు మిక్కిలి ఉంటాయి. సాధారణ సమయాల్లో ఎక్కువగా ఈ సేవలు ఉంటే వరుసగా రెండు దశల కరోనా కారణంగా చివరకు సేవలు జరుగుతున్నా భక్తులను మాత్రం అనుమతించడం లేదు.
 
కోవిడ్-19 నిబంధనలను పాటిస్తున్న టిటిడి ఏకాంతంగానే సేవలను నిర్వహిస్తోంది. అయితే ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించిన విషయాలను టిటిడి విడుదల చేసింది. ఆగష్టు నెల మొత్తం కూడా ఉత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది టిటిడి.
 
అసలు ఏ విశేష ఉత్సవాలు.. ఎప్పుడెప్పుడు జరుగుతాయో చూద్దాం. ఆగష్టు 11వ తేదీన శ్రీవారి పురుశైవారితోట ఉత్సవం, ఆగష్టు 13వ తేదీన గరుడపంచమి, శ్రీవారి గరుడ సేవ, ఆగష్టు 15వ తేదీ భారత స్వాతంత్ర్య దినోత్సవం, ఆగష్టు 16వ తేదీ మాతృశ్రీ తరిగొండవెంగమాంబ వర్ధంతిలు జరుగనున్నాయి.
 
అలాగే ఆగష్టు 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు, ఆగష్టు 22వ తేదీన శ్రావణ పూర్ణిమ, విఖనస మహాముని జయంతి, ఆగష్టు 23వ తేదీ శ్రీవారు శ్రీవిఖనసార్యులవారి సన్నిధికి వేంచేపు, ఆగష్టు 30వ తేదీ శ్రీక్రిష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్ధానం, ఆగష్టు 31వ తేదీ శ్రీవారి శిక్యోత్సవంలు జరుగనున్నాయి.