1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. ttd board member, arikela narasareddy

తితిదే పాలకమండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డి

ttd board member
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అరికెల నరసారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న స్థానంలో నరసారెడ్డి కొనసాగనున్నారు. నరసారెడ్డి గతంలో నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా పనిచేశారు. 
 
తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా కూడా కొనసాగుతున్నారని, అయితే ఈ మధ్యకాలంలో నరసారెడ్డి కూడా టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న వూహాగానాలు వినిపించడంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఆలోచనకు సిఎం చంద్రబాబు వచ్చారు. పాలకమండలిలో ఒక స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానంలో నరసారెడ్డిని నియమించారు. సంవత్సరం పాటు పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి కొనసాగనున్నారు.
About Writer
ttdj
తర్వాతి కథనం
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...