5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. శ్రీవారి దర్శనం నిలిపివేత
శ్రీదుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసి మందిరాన్ని శుద్ధి చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమంజనం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలన్నీ యధావిధిగా నిర్వహించనుంది. ఈనెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. తాళ్లపాక అన్నమాచార్యుల 513 వర్థంతి ఉత్సవాలను సోమవారం నుంచి ఈనెల 7 వరకు తితిదే ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి, తాళ్లపాకలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది.
