శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
శ్రీశైలం ఆలయం: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో దుర్ముఖినామ సంవత్సర ఉగాది మహోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించారు. ఉత్తర సాంప్రదాయంలో భాగంగా కర్ణాటకకు చెందిన మైనారులు, ఘనాచార్యులు బంగారు తాళిబొట్టు, పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు భృంగి వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సాగర్‌బాబు తెలిపారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంభా మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు దుర్ముఖినామ సంవత్సర ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేవీ.సాగర్‌బాబు తెలిపారు. మంగళవారం స్వామి వార్లకు భృంగి వాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారగ్రామోత్సవం జరిగింది. 6న స్వామి వార్లకు కైలాస వాహన సేవ, అమ్మవారికి మహాదుర్గ అలంకారం, గ్రామోత్సవం, 7న సాయం త్రం 5.30 గంటలకు ప్రభోత్సవం స్వామి వార్లకు నందివాహన సేవ, అమ్మవారికి మహా సరస్వతి అలంకారం గ్రామోత్సవం, రాత్రి 10గంటల నుంచి వీరశైవ భక్తుల వీరాచార విన్యాసములు, అగ్ని గుండ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
8వ తేదీన జరుపుకొనున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 7.30 గంటల నుంచి నింబకుసుమ ప్రసాద వితరన, ఉదయం 10 గం టల నుంచి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత ఋషీ వీరభద్ర దైవజ్ఞ శ్రీపంచాంగ పఠనం, పంచాంగ వితరణ, పం డిత సత్కారం, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాధాంగ హోమం, సాయంత్రం 4.45 గంటల నుంచి శ్రీస్వామి వార్ల రథోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు.
9వ తేదీన ఉదయం 8.30 గంటల నుంచి పూర్ణాహుతి, వసంతోత్స వం సాయంత్రం 6.30 గంటల నుంచి స్వామి వార్లకు అశ్వవాహన సేవ అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాంలకరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు ఈఉత్సవాల లో పాల్గొని శ్రీస్వామి అమ్మవార్ల కృపకటాక్షాలను పొందాలని సాగర్‌బాబు కోరారు.
