1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Vontimitta Ramayya Kalyanam

నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ - సీఎం

Vontimitta Ramayya Kalyanam
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో కళ్యాణోత్సవం బుధవారం జరుగనుంది. రాత్రి 8-10 గంటల మధ్య కల్యాణం నిర్వహించడానికి వేదికను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా దాదాపు 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, కార్పెట్‌లు సిద్ధం చేశారు. అలాగే, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
భక్తులకు ఆహారం, మజ్జిగ, మంచి నీరు అందించేందుకు 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. దీంతో 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆలయంలో పూజా విధానాలను పరిశీలించారు. స్వామివారి కల్యాణం నిర్వహించే విధానం, ఏర్పాట్ల గురించి అర్చకులతో చర్చించారు.  
About Writer
pnr