ఆపిల్స్ జిలేబీ టేస్ట్ చేశారా?
jilebi
కావలసిన పదార్థాలు..
ఆపిల్-1,
పంచదార-300 గ్రాములు,
కుంకుమ పువ్వు-ఒక గ్రాము,
నెయ్యి-500 గ్రాములు,
పాలు- 250 మిల్లీ లీటర్లు,
పెరుగు- 100 గ్రాములు
మైదా- 200 గ్రాములు.
తయారీ విధానం :
ఆపిల్ జిలేబిని తయారు చేయడానికి ముందు పెరుగుని మైదా పిండిలో వేసి నాన బెట్టాలి. ఆ తరువాత 24 గంటల వరకు అలానే వదిలేయాలి. ఇప్పుడు పంచదార తీసుకుని సిరప్ లాగా చేయండి. ఆ తర్వాత దీనిలో పాలు కూడా పోసి అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి మరిగించండి. దానిలో కట్ చేసిన యాపిల్ ముక్కల్ని పిండిలో ముంచి వేయించండి. వాటిని పక్కన పెట్టి షుగర్ సిరప్‌లో వెయ్యండి. అంతే ఇక యాపిల్ జిలేబి రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే.
తర్వాతి కథనం
