శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : బుధవారం, 22 జులై 2015 (12:33 IST)

బహిరంగంగా చుంబనాలు వద్దు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..

రైల్వే స్టేషన్లు, సబ్ వే‌లు, బహిరంగ ప్రదేశాల్లో యువతీ, యువకులు హద్దులు మీరి ముద్దులు పెట్టుకోవడాన్ని చైనా పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విధంగా ముద్దులు పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఇటీవలే ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని శేన్‌యాంగ్ నగరంలో రైలులో యువ జంట ముద్దు పెట్టుకున్నారు. 
 
పక్కన ఉన్న సహ ప్రయాణీకులను సైతం పట్టించుకోకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి ముద్దులు పెట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన ఒక ప్రయాణీకులు వారి రాస క్రీడను తన మొబైల్‌ఫోన్‌లో వీడియో తీసి, సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశాడు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్‌ల్ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోపై చైనా పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా మంగళవారం హెచ్చరించారు.
 
యువ జంట ముద్దు సన్నివేశాన్ని పోలీసులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ చుట్టూ పక్కల పరిసరాల్లో చిన్న పిల్లలు ఏమైపోవాలంటూ ఆ యువ జంటను ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు మంచిది కాదని వారు విమర్శించారు.