1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (09:58 IST)

'నాతో పోటీపడే దమ్ముందా'... ఏపీ సీఎం‌కు తలసాని సవాల్..!

ఆంధ్రా సీఎం చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా తలసాని ప్రసంగించారు. పంచ్ డైలాగ్‌లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం షో పుటప్ చేస్తున్నాడని అన్నారు. తాను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ సర్కాను ఇబ్బంది పెట్టేలా మాట్లాడాలని చెప్పారని, అయితే తాను అందుకు నిరాకరించినట్టు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తలసాని తెలిపారు.
 
అసలు చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాగా గతంలో టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబును కీర్తించిన తలసాని, పార్టీ మారగానే బద్ధ శత్రువులా మారిపోవడం గమనార్హం.