ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. కానీ తన కుమార్తె మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని బోధ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి చెందారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పసిప్రాణాలు నేలరాలుతున్నాయి. ఇంకా విద్యాశాఖ మంత్రి లేక రాష్ట్రంలో విద్యావ్యవస్థ అదుపు తప్పుతోంది.