బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2024 (12:37 IST)

బంజారాహిల్స్‌ పబ్‌పై దాడులు.. 42 మంది మహిళలు, 140 మంది అరెస్ట్

pubhyd
బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 42 మంది మహిళలు, 140 మందిని అరెస్టు చేశారు. దీంతో పాటు పబ్ మేనేజర్, క్యాషియర్, డీజే ఆపరేటర్ అరెస్టయిన వారిలో ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. టేల్స్ ఓవర్ స్పిరిట్స్ (TOS) పబ్‌లో అక్రమ కార్యకలాపాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 
 
కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో పబ్ నిర్వాహకులు వివిధ రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకున్న మహిళలతో అశ్లీల నృత్య ప్రదర్శనలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.