ప్రేమ విఫలం.. ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్.. ఎక్కడ?
ప్రేమ విఫలం కావడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, తిరుమల నగర్‌లో నివసిస్తున్న 25 ఏళ్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఒకరు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని నిబాష్‌గా గుర్తించారు.
సమాచారం ప్రకారం, ఈ తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు నిబాష్ తన స్నేహితులకు వాట్సాప్ సందేశం ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంలో విఫలం కావడం వల్లే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
