షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?
pickles
తనిఖీల సమయంలో, కల్తీ ఊరగాయల తయారీకి ముడి సరుకులుగా పాడైపోయిన టమోటాలు, మామిడికాయలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారైన ఊరగాయలను చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి అరికెళ్ల శ్రీనివాస్ (51) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేంద్రం నుండి సుమారు రూ.2.25 లక్షల విలువైన కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
