బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ అసెంబ్లీ : 6 నెలల తర్వాత అడుగుపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ (Video)

kcrao
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ ఆరు నెలల తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ నదంవరంలోని తన నివాసం నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు. 
 
ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తమ అధినేతకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీ గేటు వద్ద స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా కేసీఆర్ అసెంబ్లీ హాలులోకి ప్రవేశించారు. 
 
ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు సమాచారం. సభలో అనుసరించాల్సిన పద్దతితో దిశానిర్దేశం చేశారు. 
 
నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత 
 
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు బీహార్‌కు చెందిన కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ కేసులో ఏ2గా ఉన్న బీహార్‌కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. 
 
తన భర్త ప్రణయ్ హత్య కేసులో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తన నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాగే, అతని భవిష్యత్‌ను కాపాడుకోవడానికి తాను మీడియా ముందు కనిపించడం లేదని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. అందువల్ల శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకుని గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్టు ఆమె రాసుకొచ్చారు.