రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణం పోయింది...
రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు కోతులు కోట్లాడుకోవడంతో ఓ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది మహిళ తలపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది. ఈ దారణం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో దంపతులైన కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు.
అదేసమయంలో ఆ ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు తీవ్రంగా పొట్లాడుకోసాగాయి. ఈ క్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
