సోమవారం, 10 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మార్చి 2025 (19:39 IST)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

girls prostitution
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో గుట్టుగా సాగిస్తూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బహిర్గతం చేశారు. ఇదే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ముమ్మరం చేసింది. ఇటీవల ఖైతరాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన 18 మంది యువతులను అరెస్టు చేశారు. వీరివద్ద విచారణలో పలు కీలక విషయాలు రాబట్టారు. 
 
ఈ ముఠాలో బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్టు తేలింది. బంగ్లాదేశ్ నుంచి పలువురు అమ్మాయిలను భారత్‌కు అక్రమంగా తరలించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ఇందులో ఏదేని కుట్ర కోణం ఏమైనా ఉందా అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లోతుగా విచారిస్తుంది. 
 
రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి 
 
ఢిల్లీ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ గేటుదాటాడు. ఇది చూసిన మిగిలిన వాహనదారులు నివ్వెర పోయారు. రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైకు ఎత్తిన యువకుడుని అభినవ బాహుబలిగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఢిల్లీలో రైలు వస్తుండటంతో రైలు గేటును క్లోజ్ చేశారు. అంతలో అటుగా వచ్చిన ఓ బైక్ వాలా రైలు వచ్చేంత వరకు వేచి చూడటం సమయం వృథా అనుకున్నాడు. వెంటనే బైకును భుజానికి ఎత్తుకుని రైల్వే గేటు దాటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర వాహనదారులు బిత్తరపోయారు. బైకును మోసుకుంటూ బాహుబలిలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.