సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ కేసులో ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో రాజస్థాన్‌కు చెందిన శివరత్న మహియా (19)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక ఐఫోన్, టిక్కెట్టు, నకిలీ నోట్లు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రిప్‌కు రూ.20,000 కమీషన్ సంపాదించాలనే ఆశతో అతను నకిలీ కరెన్సీని రవాణా చేయడంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ పరారీలో ఉండటంతో, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

