1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Suryapet : Kodada Town CI Raid on the Roadside

రోడ్డుపై సీఐ హల్చల్... కాలర్ పట్టుకుని ఈడ్చెకెళ్లారు (వీడియో)

kodada town ci
తెలంగాణ జిల్లా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సీఐ తన జులుం ప్రదర్శించారు. ఫుట్ పాత్‌పై ఉన్న దుకాణాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన వారిపై తన పోలీస్ జులుం ప్రదర్శించారు. వారిపై దాడి చేసి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లడం.. జోక్యం చేసుకున్న మహిళలను అడ్డుకుని పక్కకు తోసేసి, రోడ్డుపై హల్చల్ సృష్టించారు. 
 
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో, మున్సిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే దుకాణాలను కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ కానుకలు ఇవ్వనందుకే అధికారులు తమ దుకాణాలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 
 
మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ సీఐ బాధితులపై దాడి చేసి, వారి కాలర్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి, అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉద్యోగం కోల్పోయి డిష్‌వాషింగ్ పనిలో చేరిన 29 యేళ్ల వ్యక్తి... డబ్బు కోసం కాదట...