Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rain
ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణంగా 664.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 536.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
