1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 7 మార్చి 2015 (09:43 IST)

'బెంగళూర్ డేస్'లో నయన్.. హీరోయిన్‌‌గా కాదు.. మరి..?!

ఇటీవల మలయాళ సినిమాలు సూపర్ హిట్లు కొడుతున్నాయి. ఆ మధ్య విక్టరీ వెంకటేశ్ హీరోగా విడుదలైన మలయాళ చిత్రం 'దృశ్యం' ఘన విజయం సాధించింది. తాజాగా మరో మలయాళ హిట్ చిత్రం 'బెంగళూర్ డేస్' కూడా తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్ అవుతుంది. 
 
ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. తెలుగు వెర్షన్ కి వేణు శ్రీరాం, తమిళ వెర్షన్ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు వెర్షన్ కి శర్వానంద్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎంపికైన సంగతి తెలిసిందే.
 
ఈ చిత్రంలో నటించేందుకు తాజాగా నయనతారను కూడా ఎంచుకున్నట్టు సమాచారం. అయితే ఇందులో హీరోయిన్‌గా కాదు, ఓ కీలకమైన పాత్రలోనట. మలయాళం ఒరిజినల్‌లో నటించిన నిత్యా మీనన్ పాత్రను నయన్ పోషిస్తుందని సమాచారం.