పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం... చిరంజీవి ఫ్యాన్స్‌తో కిర్రాక్...

pawan
ivr| Last Modified మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:31 IST)
జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ అభిమాన సంఘం పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని టాలీవుడ్ న్యూస్. కాగా
ఈ సమావేశం రాజమండ్రి లేదా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చీలిక వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు పవన్‌ కళ్యాణ్ అభిమాన సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్‌ ఇటీవల తెలిపారు.

త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్‌ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్‌ తెలిపారు.

ఈ నెల 30 తిరుపతిలో చిరంజీవి, పవన్‌ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. 30న ఫ్యాన్స్‌డేగా జరపాలని నిర్ణయించామని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ రాజకీయ విధానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. అయితే చిరు సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామన్నారు. చిరు, పవన్, చెర్రీ, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.దీనిపై మరింత చదవండి :