గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:47 IST)

నా మొగుడిది గోల్డెన్ లెగ్... అందుకే నాకు తెగ ఆఫర్లొస్తున్నాయి... రీమాసేన్!!

రీమాసేన్ తాజాగా జరుగుతున్న ఓ కోలీవుడ్ సినిమా షూటింగ్ విరామంలో లేడీలా గెంతుతూ చాలా ఖుషీఖుషీగా కనబడింది. ఆ సంతోషం వెనుక కారణం ఏమిటా.. అని ఒక పిల్లజర్నలిస్టు ఆమెను కదిలించాడు. "ఏమిటో చెప్పుకో చూద్దాం" అంటూ రెండు పెదవులను సెక్సీగా సాగదీస్తూ నవ్వింది రీమా.

అతడు తడుముకుంటుండగానే.. "మరేం లేదు.. నాకు పెళ్లయిన తర్వాత భలేభలే ఆఫర్లు వస్తున్నాయి. మా ఆయనది గోల్డెన్ లెగ్. ఆయన్ను కట్టుకున్న తర్వాత నాకు అదృష్టం కలిసొచ్చింది. సహజంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు అక్క, వొదిన పాత్రలే వస్తుంటాయి.

కానీ నా విషయం అలాక్కాదు. స్ట్రెయిట్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు వస్తున్నాయి. ఇటీవల నేను నటించిన బాలీవుడ్ చిత్రం ఒకటి సూపర్ హిట్టయింది. ఇప్పుడు తమిళ హీరో విజయ్ తన సరసన నన్ను బుక్ చేశారు. 'సట్టం ఒరు ఇరుట్టరై' చిత్రంలో నేను ఫుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా చేస్తున్నాను.. ఇప్పుడు చెప్పు.. మావారిది గోల్డెన్ లెగ్ కదూ.." అంటూ మళ్లీ చెంగుచెంగున షాట్‌లో నటించేందుకు వెళ్లిపోయిందట. అవును మరి.. రీమాసేన్‌కు పెళ్లినీళ్లు పడినట్లున్నాయ్.. అందుకే అందరి కళ్లల్లో ఇప్పుడు పడుతోంది.