గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (19:50 IST)

బికినీలో ఏం కనపడుతుందీ... లక్ష్మీరాయ్ ప్రశ్న

హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌ కాంచనమాల కేబుల్‌ టీవీ చిత్రం ద్వారా హాట్‌హాట్‌గా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. నీటిలో ఆమె చేసిన సీన్స్‌ మత్తెక్కిస్తాయి. తాజాగా మంగాత్తు అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ సినిమాపై కదిలిస్తే... అందులో బికీనీలో నటించాను. అయితే పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. 

హాట్‌హాట్‌గా అస్సలే కనబడలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా అందులో చూపించారు... అంటూ చెప్పింది. బికినీలో ఉన్నా... సన్నివేశం పరంగా అది వచ్చింది. దానిని పెద్దది చేయడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది. అయితే ఇదంతా లక్ష్మీరాయ్‌ ప్లే చేస్తున్న టెక్నిక్‌ అని తెలుస్తోంది.

బాలకృష్ణ సరసన అధినాయకుడులో నటించింది. ఎక్స్‌పోజింగ్‌కే పరిమితమైనా ఈ చిత్రం పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో బికినీలోనైనా చేయడానికి రెడీ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోందని అంటున్నారు టాలీవుడ్ సినీజనం.